స్టాఫ్ నర్సులకు వెంటనే సర్వీస్ సర్టిఫికేట్లు ఇవ్వాలి


Ens Balu
10
Vizianagaram
2022-12-03 14:08:49

విజయనగరం జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిలో వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సులుగా చేస్తున్న వారికి తక్షణమే సర్వీస్ సర్టిఫికేట్ లు జారీ చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.కే.పద్మలీల ను ఆదేశించారు. వారు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే గడువు సమీపిస్తున్న కారణంగా సోమవారం లోగా అందరికీ సర్టిఫికెట్ లు మంజూరు చేయాలని చెప్పారు. కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ ను కలిసి తమ సమస్యను విన్నవించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం ఉద్యోగి ఒకరు సర్టిఫికేట్ లు నిరాకరించడంతో పాటు తమ పట్ల దురుసుగా మాట్లాడుతున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే మంత్రి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. పద్మలీల తో ఫోన్ లో మాట్లాడి సర్టిఫికేట్ ల జారీతో పాటు మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన శాఖ ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సిఫార్సు