ప్రత్యేక సారాంశ సవరణపై నేడు సమావేశం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్పెషల్ సమ్మర్ రివిజన్ 2023 కొరకు రోల్ అబ్జర్వర్ గా రాష్ట్ర డెయిరీ అభివృద్ధి కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎపి అమూల్ ప్రత్యేక అధికారి శ్రీ అహ్మద్ బాబుని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఈ సమావేశంలో అబ్జర్వర్ పాల్గొంటారని, ఈ నెల 6వ తేదీన ఉదయం 9.30 గం.ల నుండి ఉ.11.00 గం.ల కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇఆర్ఓలతో ఇంటరాక్షన్ ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంనకు ప్రజా ప్రతినిదులు, అధికారులు హాజరు కావలసినదిగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.