శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార సంస్థలు జిల్లా పర్యాటక శాఖ వాణిజ్యంలో నమోదు చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్. నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి, పర్యాటక శాఖ కమీషనరు ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటు వంటి హెూటల్స్, రిసార్ట్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్లు, హెూమ్ లు, ఫార్మ్ స్టేలు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ బోట్ ఆపరేటర్స్, అడ్వెంచర్ గేమ్స్ ఆపరేటర్స్, వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్స్, ఎంఐసిఐ కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలు, సర్వీస్ అపార్ట్మెంట్లకు టూరిజం ట్రేడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలని పేర్కొన్నారు. పర్యాటక వాణిజ్యంలో నమోదు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాతి నిధి సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందని వివరించారు. ఈ నమోదు ప్రక్రియ ఆన్లైన్ లో www.atourism.gov.in వెబ్ సైట్ ద్వారా చేయాలని చెప్పారు. నమోదుకు సంబంధించిన దరఖాస్తులు, ఫీజు వివరాలు వెబ్ సైట్ లో లభ్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. దరఖాస్తు నమోదు, ఇతర సందేహాలకు 6309942033 నంబరుకు ఫోన్ లో సంప్రదించ వచ్చని సూచించారు.