పోలీసు శాఖలో హోంగార్డుల విధులు చాల కీలకమని,జిల్లా హోమ్ గార్డుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక పేర్కొన్నారు. మంగళవారం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో నిర్వహించిన 60వ హోమ్ గార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ క్రమంలో ముందుగా పరేడ్ కమెండేర్ హోమ్ గార్డు శసికుమార్ ఎస్పీనకు గౌరవ వందనం సమర్పించారు.ఈ క్రమంలో జిల్లా ఎస్పీ శాంతికి చిహ్నంగా పావురాలును గాలిలోకి విడిచిపెట్టారు. హోమ్ గార్డుల ప్లేటునులు నిర్వహించిన పరేడును ఎస్పీ తిలకించారు.ఈ సందర్భంగా ఎస్పీ హోమ్ గార్డులనుద్దేశించి మాట్లాడుతూదేశంలో చైనా దేశం తో యుద్ధం తర్వాత పోలీసులతో సమానంగా కలిసి పనిచేయుటకు హోంగార్డు అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి అన్ని రాష్ట్రాల్లో హోంగార్డులు సేవలు అందిస్తున్నారు తెలిపారు. జిల్లాలో 1965లో హోమ్ గార్డ్ వ్యవస్థ ప్రారంభమై నేటికి 739 హోంగార్డులలు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
హోమ్ గార్డుల సంక్షేమం దృష్ట్యా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హోమ్ గార్డ్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియా లేరు వారికిచ్చే గౌరవ వేతనం తక్కువ అయినప్పటికీ పోలీసు సిబ్బందితోపాటు సరిసమానంగా విధులు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. పకృతి వైపరీత్యాల్లోనూ, శాంతభద్రతలు పరిరక్షణలో, రాత్రి గస్తీలతో పాటు వివిధ విఐపిల బందోబస్తు విధులులో సమయపాలనతో విధులు నిర్వర్తించి మన్నాలను పొందుతున్నారుని కొనియాడారు.హోమ్ గార్డుల ఆవిర్భావ దినోత్సవం నకు చాల ప్రాముఖ్యత ఉందిని కావున ప్రతి ఒక్కరూ బాద్యత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జెడి వి.ఎన్.మణికంఠ అదనపు ఎస్పీ టి.పి.విఠలేశ్వరరావు, డీఎస్పీలు ఎస్ బాలరాజు,జి. శ్రీనివాసరావు,సిహెచ్ ప్రసాద్ రావు, ఆర్ఐలు ప్రేదిపు,ఉమా మహేశ్వరరావు,హోమ్ గార్డులు,తదితరులు పాల్గొన్నారు.