తుఫాను కేంద్రాల మరమ్మతులు పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సంబంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని తుఫాను కేంద్రాల మరమ్మతులు పై సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను కేంద్రాల మెంటెనెన్స్ లను పరిశీలించాలని, ఇందుకు కొంత నిధులను కేటాయించడమైనదని, సమస్యలు ఏమైనా ఉంటే తహసీల్దార్లు గుర్తించాలని ఆదేశించారు. కార్పస్ ఫండ్ గా ఒక్కో తుఫాను కేంద్రానికి నిధులు మంజూరు చేయడమైనదని డిఆర్డిఎ పిడి విద్యాసాగర్ వివరించారు. తుఫాను కేంద్రాలు, తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఎక్వూప్ మెంట్, సైరన్లు చూడాలని కలెక్టర్ చెప్పారు.
నిధులు అవసరమైతే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మండలాల్లో అత్యవసర కేంద్రాలు ఉన్నాయని, సైరన్ లు కేటాయించడమైనదని, మరమ్మతులు ఉంటే గుర్తించి ప్రతిపాదనలు పంపాలన్నారు. తహసీల్దార్లు కోస్టల్ మండలాలపై దృష్టి సారించాలని చెప్పారు. తుఫాను కేంద్రాలకు అవసరమైతే అదనపు నిధులు పంచాయతీ రాజ్ ఇంజనీర్లుతో సమన్వయం చేసుకొని ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, పలాస ఆర్డీఓ సీతారామమూర్తి, సిపిఒ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.