శ్రీకాకుళం జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత అభివృధి చెందాలి, కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నై తో రిజిష్టర్ కానివి తొలగించవచ్చు అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ, శ్రీకాకుళం, టెక్కలి మరియు పలాస డివిజినల్ స్థాయి అక్వాకల్చర్ కమిటీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో మత్స్య శాఖ, అటవీశాఖ, రెవెన్యూ , ఇరిగేషన్, వ్యవసాయ మరియు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. జాతీయ హరిత ట్రిబునల్ స్పెషల్ బెంచ్, చెన్నై వారి యొక్క ఆదేశములు మేరకు జిల్లా లోని అనుమతి లేకుండా 1401 ఎకరాలు రొయ్యలు సాగు చేస్తున్న 464 మంది రైతులను గుర్తించడమైనది. సదరు రైతులకు కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నై రూల్స్ ప్రకారం క్రమబద్దీకరణ చేయుటకు గల అవకాశాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని డివిజినల్ స్థాయి అక్వాకల్చర్ కమిటీలకు జిల్లా కలెక్టర్ ఆదేశించడమైనది.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత అభివృధి పరిచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 2953 ఎకరాలు ఆక్వాకల్చర్ జరుగుతుందని. అందులో 1552 ఎకరాలు రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నాయని, 1401 ఎకారాలు రిజిస్ట్రేషన్ లేకుండా ఆక్వాకల్చర్ నిర్వహిస్తున్నారని, సంబంధిత మండల తహశీల్దార్లు 1401 ఎకరాలకు సంబంధించిన నివేదికలు అందజేయాలి అన్నారు. ఆక్వాకల్చర్ చేస్తున్నావారికి రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ చేయాల్సింది, లేని వాటిని రద్దు చేయాలన్నారు. ఇది మంచి అవకాశం. జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత పెంచాల్సి ఉందని అందుకు కావలసిన చర్యలు చేపట్టాలని జిల్లాలో ఆక్వాకల్చర్ మరింత పెంచే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆక్వాకల్చర్ కు సంబంధించిన వివరాలు తెలియజేసారు. జిల్లాలో రిజిస్ట్రేషన్ ఉన్న వారికి మాత్రమే రాయితీలు వర్తిస్తాయని అందుకే రిజిస్ట్రేషన్ తప్పక కలిగి ఉండాలన్నారు. 5 హెక్టార్లు కన్నా తక్కువ విస్తీరణం గల రైతుల ధరఖాస్తులను డివిజినల్ స్థాయి కమిటీ ఛైర్మన్ గారైన రెవెన్యూ డివిజినల్ అధికారి వారి ఆమోదంతో కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నైవారికి నేరుగా పంపవచ్చును 5 హెక్టార్లు కన్నాపై బడి విస్తీరణం గల రైతుల ధరఖాస్తులను మాత్రం జిల్లా కలెక్టర్ , జిల్లా స్థాయి కమిటీద్వారా కోస్టల్ అక్వాకల్చర్ అథారిటీ , చెన్నైవారికి పంపడమగునని తెలిపినారు.
ఈ సమావేశంలో టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ రెడ్డి, జిల్లా అటవీ అధికారి జి. హారిక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ పి.వి.శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ వెంకట్ రామన్, డి.ఆర్.డి.ఎ ప్రోజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్, పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి సితారాముర్తి, మండల రెవెన్యూ అధికారులు, మత్స్య శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.