ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని జిల్లాకు రాక


Ens Balu
16
Srikakulam
2022-12-06 13:59:27

శ్రీకాకుళం జిల్లాలోని పాత్రికేయులతో జర్నలిజం మౌలిక సూత్రాలు, విలువలు, ప్రమాణాలపై ఈ నెల 12న అవగాహన సదస్సు జరుగనుందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. డిసెంబర్ 12న ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు జిల్లాలో పర్యటించనున్నారన్నారు. పర్యటనలో భాగంగా డిసెంబర్ 12తేదీ సోమవారం స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉదయం 11:00 గంటలకు జర్నలిజం మౌలిక సూత్రాలు, విలువలు, ప్రమాణాలపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అవగాహనా సదస్సులో పాల్గొన్న వారికి పార్టిషిపేషన్ ధృవపత్రం అందజేయడం జరుగుతుంది జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో జరిగే ఈ అవగాహన సదస్సుకు రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ శ్రీమతి పిరియా విజయ అతిథులుగా హాజరుకానున్నారన్నారు. వీరితో పాటు జిల్లా అధికారులు తదితరులు పాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో వివరించారు.
సిఫార్సు