పార్వతీమన్యం జిల్లాకి ఆయన జాయింట్ కలెక్టర్..చిటికేస్తే ప్రైవేటు ఆసుపత్రిలో కార్పోరేట్ వైద్యం కాళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది.. కానీ తన భార్యను ప్రభుత్వ ఆసుపత్రికే పురుడు పోయడానికి తీసుకెళ్లారు.. అదీ తల్లీబిడ్డా వాహనంలోనే.. ప్రభుత్వ ఆసుపత్రిలో చక్కటి కార్పోరేట్ స్థాయి వైద్యం అందుతుందని.. దానిని
ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తానే స్వయంగా ఆసుపత్రి సేవలను వినియోగించుకున్నారు జెసి ఓ.ఆనంద్. ఆసుపత్రి సిబ్బంది కూడా పరిశుభ్ర వాతావరణంలో పురుడు పోసి చక్కగా మళ్లీ అధే వాహంలో ఇంటికి దగ్గర దించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగానే కార్పోరేట్ వైద్యం ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తున్నదన్నారు. ముఖ్యంగా ప్రసవాల సేవలకు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగించేసుకోవాలని సూచించారు. తల్లీ బిడ్డను ప్రభుత్వ తల్లీబిడ్డ వాహనంలో తీసుకువచ్చిన సిబ్బందిని జెసి ఈ సందర్భంగా అభినందించారు.