జగనన్న పాలవెల్లువ కార్యక్రమం రెండో విడత ప్రారంభానికి సంబంధించిన పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరంలో బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడతలో నరసాపురం , పాలకొల్లు, యలమంచిలి మండలాలలోని 25 గ్రామాలలో పాలు సేకరణ చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. పాల సేకరణ చేయడానికి రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలని అన్నారు. ఏఎంసి సిబ్బందికి , ప్రమోటర్స్ కి సెక్రెటరీ అసిస్టెంట్ సెక్రటరీలకు శిక్షణ పూర్తి చేయాలన్నారు.బి ఎం సి యు లలో మిషన్లు ఏర్పాటు చేసి కాలిబ్రేషన్ చేయడంతో పాటు సాఫ్ట్ వేర్ అప్డేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బీ ఎం సీ యు లకు 2 భవనాలు గుర్తించాలని ఆదేశించారు. ఈనెల 11వ తారీఖున నరసాపురం మండలంలో బీఎంసీ యు లో జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కింద గతంలో ప్రారంభించిన 10 గ్రామాలలో ప్రతిరోజు 1,769 లీటర్లు పాలు సేకరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పాలు సేకరణ ఇంకా పెంచాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో డిఆర్ డి ఏ పిడి వేణుగోపాల్ , పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ .మురళికృష్ణ , డి సి ఓ ఎం. రవికుమార్ , డిపిఓ ఎం. నాగలత, మార్కెటింగ్ శాఖ అధికారులు ,ల్యాండ్ సూపర్డెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.