భూహక్కు పత్రాలలో తప్పులుంటే మార్పులు చేసుకోవచ్చు


Ens Balu
14
Parvathipuram
2022-12-07 15:58:09

భూహక్కు పత్రాలలో తప్పులుంటే మార్పులు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు.  బుధవారం తహశీల్దార్ల, రెవన్యూ సిబ్బందితో భూ సర్వేపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
 ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ సూచనలిస్తూ భూహక్కు పత్రాలలో ఫోటో మిస్సింగు, వివరాలు నమోదులో తప్పులుంటే మార్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. భూ హక్కు పత్రాలలో తప్పులున్నా, భూమి వివరాలు నమోదు కాకున్నా రైతులు ఆందోళన చెందనవసరం లేదని, మ్యుటేషను ధరఖాస్తు ద్వారా మార్పులు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ విషయాన్ని రైతు లందరికీ విలేజ్ రెవిన్యూ అధికారులు తెలియజేయాలన్నారు. నోటీసులు రైతులందరికీ వ్యక్తిగతంగా అందజేసి, రశీదులు తీసుకొని రికార్డు చేయాలన్నారు..  భూ సర్వేకు సంబంధించిన మొత్తం రికార్డు భద్రపరచాలన్నారు.  రైతుల వివాదాలకు సంబంధించిన వారి వాదనలను, రికార్డులను,  మొబైల్ కోర్టు ఆర్డర్లను  భద్రపరచాలని తెలిపారు. రీ సర్వే ప్రక్రియ పక్కాగా అమలుచేయాలని అదికారులను జిల్లా కలెక్టరు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  సంయుక్త కలెక్టు ఒ. ఆనంద్, సబ్ కలెక్టరు నూరుల్ కమర్,  జిల్లా రెవిన్యూ అదికారి జె. వెంకటరావు, జిల్లా సర్వే సెటిల్మెంటు అధికారి కె. రాజకుమార్, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, వి.ఆర్.ఒ.లు పాల్గొన్నారు.