మాండోస్ తుఫాను నేపథ్యంలో బాపట్ల కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలియజేశారు. అత్యవసర సేవల కోసం ప్రజలు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలన్నారు. కాగా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ నెం.8712655881 నెంబరును అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓల అన్ని ప్రభుత్వశాఖలకు తెలియజేశారు. అంతేకాకుండా మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తుఫాను సమాచారాన్ని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. జిల్లా ప్రజలు ఎవరు భయపడాల్సిన పనిలేదన్నారు.