4వ రోజు అనంతలో 80.62% హాజరు..


Ens Balu
2
Anantapur
2020-09-23 13:06:34

అనంతపురం జిల్లాలో సచివాలయ ఉద్యోగాల భర్తీ కొరకు చేపట్టిన నాల్గవ రోజు నిర్వహించిన రాత పరీక్షల్లో 80.62 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు  తెలిపారు. బుధ వారం అనంత నగరం ప్రధాన కేంద్రం లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జరిగిన కేటగిరి - 3  గ్రేడ్ -2 గ్రామ వ్యవసాయ సహాయ కులు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షకు 1156 మంది  అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 932  మంది హాజరయ్యారని ,  224 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరుకాగా ,  80.62 శాతం హాజరు నమోదయ్యిందన్నారు. అనంతపురం ప్రధాన కేంద్రం లోని 6 పరీక్ష కేంద్రాల్లో నాల్గవ రోజు పరీక్ష నిర్వహించారన్నారు. అలాగే జె ఎన్ టి యు వైపునున్న కెఎస్ఎన్ మహిళా డిగ్రీ కాలేజీ పరీక్షా కేంద్రంలో 1( ఒకరు)విభిన్న ప్రతిభావంతులు  వ్రాతపరీక్షను వ్రాసినట్లు  జిల్లా కలెక్టర్ తెలిపారు. అటు జెసి సిరి కూడా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ వివరించారు.