స్పందన కార్యక్రమంలో ప్రతి సోమవారం వచ్చిన దరఖాస్తులు ఫిర్యాదులపై వెంటనే తగిన చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తోపాటు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డి ఆర్ ఓ పి వెంకటరమణ దరఖాస్తులు స్వీకరించారు. డిఆర్ఓ వికలాంగుల వద్దకు స్వయంగా వెళ్లి దరఖాస్తులు స్వీకరించారు. ఈరోజు స్పందనకు 176 అర్జీలు వచ్చాయన్నారు.