ఓటరు నమోదులు, తొలగింపులు, మార్పులు, చేర్పులు పక్కాగా, పారదర్శకంగా చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సహాయ ఎలెక్టోరల్ అధికారుల (తహసిల్దార్లు) ను ఆదేశించారు. సోమవరo కలెక్టరేట్ వీడియొ కాన్ఫెరెన్స్ హాల్ నుండి జిల్లాలోని తహసిల్దార్లు , సబ్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియొ కాన్ఫెరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు అందిన ఓటరు నమోదుకు సంబంధించి ఫారం-6, తొలగింపులకు సంబంధించి ఫారం -7, బదిలీలకు సంబంధించి ఫారం -8 ల పై క్షేత్ర స్థాయిలో త్వరగా విచారణ జరిపి పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా జూలై నుండి నవంబర్ వరకు అందిన శరఖాస్తులు కూడా పరిష్కరించాలన్నారు. తుది ఓటర్ల జాబితా జనవరి ఐదున ప్రచురించాల్సి ఉన్నందున పరిష్కార చర్యలు వేగవంతం చేయాలని, ఎత్తి పరిస్తితులలోనూ, సరైన కారణం లేకుండా ధరఖాస్తు తిరష్కరణ చేయరాదని, ఓటరుగా తొలగించరాదని హెచ్చరించారు.
జిల్లాలో 2,771 దరఖాస్తులు (ఫారం 6,7,8 లు) రాగా, 1,950 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, పెండింగ్ ధరఖాస్తులపై పది రోజుల్లోగా చర్యలు పూర్తీ చేయాలన్నారు. పూర్తి చేసిన తరువాత వాటిని డిజిటలైజేషన్ చేసి పరిష్కారం చేయాలన్నారు. ఒక్కో మండలంలో సుమారు 500 దరఖాస్తులు ఉంటాయని, ప్రతి మండలంలో కనీసం 40 నుండి 50 మంది బి.ఎల్.ఒలున్నందున ఒక్కో బి.ఎల్.ఓ ఫరిధిలో 10 దరఖాస్తులు మించి ఉండవని, క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ నెలాఖరుకు ఎలెక్టోరల్ రోల్ అబ్జర్వర్, వచ్చే నెలలో ఎలెక్షన్ కమిషనర్ వచ్చే అవకాశామున్నందున పరిష్కార చర్యలు, ఎటువంటి అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 22 వ తేదీకి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి మండలO లో తప్పనిసరిగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఓటరు విధులలో విఆర్ఎ లు ఉండరాదని, ఎక్కడైనా ఉంటె వారి స్థానంలో వేరే వారిని నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియొ కాన్ఫరెన్సు లో ప్రధాన కేంద్రం నుండి శిక్షణా కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఎన్నికల పర్యవేక్షకులు నాగ జ్యోతి, మoడలాలనుoడి తహసిల్దార్లు, సబ్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.