హోమ్ గార్డ్ డీఎస్పీ గా దుండి ఏడుకొండలరెడ్డి సోమవారం భాద్యతలు స్వీకరించారు. అనంతరం విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 1991లో ఏఆర్పిసిగా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరిన ఆయన 1996లో ఆర్ఎస్ఐగా పదోన్నతి పొందారు. ఇటీవల జరిగిన బదిలీలలో విశాఖ హోమ్ గార్డ్ డీఎస్పీ గా నియమితులయ్యారు. ఈయన విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ఆరు జిల్లాలకు ఆయన ఇంచార్జి గా వ్యవహరిస్తారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గడ్ మొదలగు రాష్ట్రాలలో విధినిర్వహణలో భాగంగా అడవులలో దాదాపుగా లక్ష కిలోమీటర్లపైగా నడిచిన వ్యక్తిగా ఏడుకొండలరెడ్డి పేరొందారు.