అగ్రీ అసిస్టెంట్స్ పరీక్షకు 79.69% హాజరు..
Ens Balu
2
Vizianagaram
2020-09-23 13:09:32
విజయనగరం జిల్లాలో గ‌్రామ సచివాలయాల గ్రామ వ్యవసాయ సహాయకుల ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి నాలుగో రోజైన బుధవారం నగరంలోని రెండు కేంద్రా ల్లో ఉదయం పరీక్ష జరిగింది. ఎం.ఆర్.ఆటానమస్ కళాశాల, రింగురోడ్డులోని శ్రీచైతన్య పాఠశాలల్లో ఈ పరీక్ష నిర్వహించారు. రెండు కేంద్రాల్లోనూ ఈ పరీక్షకు 896 మంది అభ్యర్ధులు హాజరు కావలసి వుండగా వీరిలో 714 మంది పరీక్షకు హాజరైనట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. మొత్తం 79.69 శాతం హాజరు నమోదైనట్టు పేర్కొన్నారు. 182 మంది పరీక్షకు గైర్హాజరైనట్టు తెలిపారు. ఎం.ఆర్.ఆటానమస్ పరీక్ష కేంద్రంలో పరీక్ష జరుగుతున్న తీరును జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ పరిశీలించారు. డి.ఆర్.డి.ఏ. ప్రాజెక్టు డైరక్టర్ కె.సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపాల్ డా.జి.వి.కళ్యాణి తదితరులు వున్నారు. కోవిడ్ లక్షణాలు గల అభ్యర్ధులు ఎవ్వరూ పరీక్షలకు హాజరు కాలేదన్నారు. ఎం.ఆర్.కళాశాలను సందర్శించిన కలెక్టర్ కళాశాల క్యాంపస్ ను అందంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దే అంశంపై కళాశాల ప్రిన్సిపాల్ కు కలెక్టర్ పలు సూచనలు చేశారు. వృక్షాలకు రంగులు వేయించాలన్నారు. విజయనగరం ఉత్సవాల సందర్భంగా కళాశాలను విద్యుద్దీపాలతో అలంకరించే ఏర్పాటు చేస్తామన్నారు.