శ్రీనివాస సేతు పనులు త్వరితగతిన పూర్తిచేయాలి


Ens Balu
18
Tirupati
2022-12-13 12:15:35

శ్రీనివాస సేతు పనులు త్వరగా పూర్తి చేయాలని టిటిడి ఈఓ ఏవి ధర్మారెడ్డి ఆదేశించారు. టిటిడి పరిపాలన భవనంలో మంగళవారం తిరుపతి మున్సిపల్ కమిషనర్ అనుపమ అంజలితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ,  శ్రీనివాస సేతు పనులు  ఇప్పటికే 85 శాతం  పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూడవ దశలో నిర్మాణంలో ఉన్న దాదాపు 60 మీటర్ల స్టీల్ గర్డర్ లను జనవరి 31వ తేదీకి  నాటికి ఏర్పాటు చేయాలన్నారు. డెక్స్ ల్యాబ్ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రామానుజ సర్కిల్ వైపు, సుబ్బలక్ష్మి విగ్రహం వైపు, రేణిగుంట రోడ్డు వైపు, తిరుచానూరు రోడ్డు వైపు జరుగుతున్న పనులపై  సమీక్షించారు.

 అదేవిధంగా పాదాచారులు నడి చేందుకు అనువుగా పేవ్ మెంట్ , కాలువలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. నిర్ణీత సమయంలో శ్రీనివాస సేతు పనులు పూర్తి చేసేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సంస్థ మేనేజర్  రంగస్వామిని ఆదేశించారు. ఈ సమావేశంలో జేఈవోలు  సదా భార్గవి,  వీరబ్రహ్మం, ఎఫ్ ఎ అండ్ సీ ఏవో  బాలాజీ, సి ఇ  నాగేశ్వరరావు,  మున్సిపల్  ఎస్ ఇ   మోహన్, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ జిఎం చంద్రమౌళి ఇతర అధికారులు పాల్గొన్నారు.