ఉద్యోగుల ఆందోళనకు ఎమ్మెల్సీ మాధవ్ మద్దతు


Ens Balu
10
Visakhapatnam
2022-12-13 12:38:08

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు,పింఛనర్లు తమకు ఇవ్వవలసిన జీతాలు ప్రతీనెలా 1వ తారీఖున ఇవ్వాలని చేస్తున్న ఆందోళనకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , బీజేపీ శాసన సభ పక్ష నేత, ఎమ్మెల్సీ పివియన్ మాధవ్ తన మద్దతు తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ ప్రభుత్వ   ఉద్యోగులకు  ప్రతినెలా 1వ తేదీన రావలసిన జీతాలు, 2వ వారం దాటిన తర్వాత ఇవ్వడాన్ని తప్పుబట్టారు. 2018 నుండి పెరిగిన జీతాల  ఏరియర్సు , 7 డీఏ లు ఇప్పటి వరకు ఇవ్వకపోగా, కనీసం జీతాలు కూడా సమయానికి ఇవ్వక పోవడాన్ని  తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై ఆందోళన చేస్తున్న ఉద్యోగులను  నోటీసులు,కేసులు తో బెదిరించడం సరైన విధానం కాదన్నారు. 

సమయానికి జీతాలు రాకపోవడం కారణంగా బ్యాంకు రుణాలు తీసుకున్న వారు, దీర్గకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పేషెంట్సు (రోగులు), ముఖ్యంగా పింఛనర్లు అనేక ఇబ్బందులు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేకపోవడం వలనే ఇలాంటి పరిస్థితి  తలెత్తిందని ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. ప్రతి నెలా ఇదే తంతు జరగడం వలన ఉద్యోగులలో జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీవ్రతరమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం, ఉద్యోగులకు ఖచ్చితంగా ప్రతీనెలా 1వ
తేదీన జీతం, ఫించన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.