దేశంలోనే డైనమిక్ సిఎం వైఎస్ జగన్ మాత్రమే..
Ens Balu
3
Visakhapatnam
2020-09-23 13:24:27
ఆంధ్రప్రదేశ్ కి దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ తరువాత అంతటి డైనమిక్ సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మాత్రమేనని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. బుధవారం ఆశీల్ మెట్టలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 14 నెలలు మనసు చంపుకొని తెలుగు దేశంపార్టీ తరుపున కార్యక్రమాలు చేపట్టానని.. తలచుకుంటేనే ఆవేదన వుందని చెప్పారు. దక్షిణ నియోజకవర్గం లో చాలా పనులు పెండింగ్ ఉన్నాయి వాటిని పూర్తి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ని కలిసినపుడు కోరినట్టు వివరించారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పారు. దమ్మున్న సీఎం ఏపీలో ఉన్నప్పుడు అలాంటి నాయకుడి టీమ్ లో పనిచేయాలనే ఆలోచనతోనే వైఎస్సార్సీపీ పార్టీలో చేరానని చెప్పిన గణేష్ కుమార్ 14 నెలల వ్యవధిలో ఇచ్చిన హామిలన్నీ 90శాతం పూర్తిచేసిన ఏకైన సీఎం దేశంలో వైఎస్ జగన్ ఒక్కరేనన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షానికి పని లేకుండా చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వమని కొనియాడారు. విశాఖ మేయర్ ఎలక్షన్స్ లో ఏ బాధ్యత ఇచ్చినా కష్టపడి పనిచేస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 13 ఏళ్లుగా చిన్న స్థాయి నుంచి నేడు ఎమ్మెల్యే స్థాయి వరకు పెరిగానని అన్నారు. ప్రజలు, నాయకుల ఆశీస్సులతో పార్టీలో సేవచేసుకుంటానని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు.