విద్యుత్ ను పొదుపు చేస్తే దేశానికి సేవ చేసినట్లే నన్ని జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు అన్నారు. ఇంధన వారోత్సవాల్లో భాగంగా ఎపి ఎపి డి సి.ఎల్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి చేపట్టిన ర్యాలీ నీ జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంధన పొదుపు చేయడం ప్రతి ఇంటిలో రోజు వారి అలవాటుగా మారాలన్నారు. విద్యుత్ పొదుపు చేయడం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పరోక్షంగా సహకరించినట్లు అవుతుందన్నారు. పర్యావరణాన్ని కాపాడటం ద్వారా భావి తరాల మంచి భవిష్యత్ ఇచ్చినట్లు అవుతుందన్నారు. ప్రధానంగా ఇంధన పొదుపు చేయడం విద్యార్ది దశ నుంచే నేర్పించాలని కోరారు. విద్యుత్ పొదుపు అనేది ఉద్యమం లా ఉండాలన్నారు.
పొదుపు వారోత్సవాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. అనంతరం ఎపి ఈ పి.డి.సి.ఎల్ సూపరెండెంట్ పి.నాగేశ్వరరావు విద్యుత్ పొదుపు వారోత్సవాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. ప్రధానంగా గ్రామ స్థాయిలో ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు అవగాహన ర్యాలీ లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 20.తేదీ వరకు జరిగే వారోత్సవాల్లో భాగంగా విద్యార్దులకు క్విజ్, వ్యాసరచన, వ్రకృత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఇంధన పొదుపు చేయమనేది ప్రతి మనిషి పాటించాలన్నారు. ఏసి లు వాడటం 24.డిగ్రీలు నుంచి ఆ పైన ఉంచి వాడటం వలన పొదుపు చేయడం అవుతుందన్నారు. ర్యాలీలో విద్యుత్ శాఖ ఈ ఈ నాగిరెడ్డి కృష్ణ మూర్తి,డీ. ఈ లు,విద్యుత్ శాఖ సిబ్బంది,ఉద్యోగులు పాల్గొన్నారు.