బాపట్ల జిల్లాలో 6మండలాల్లో రైతు ఉత్పత్తి కేంద్రాలు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ చెప్పారు. మంగళవారం బాపట్ల కలెక్టరేట్ లో రైతు ఉత్పత్తి సంస్థల జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆరు రైతు ఉత్పత్తి సంస్ధలు ఏర్పాటు చేయడానికి కమిటీ కి ప్రతిపాదనలు వచ్చాయన్నారు. కమిటీ పరిశీలించి జిల్లాలో కొల్లూరు, చేరుకుపల్లి,వేమూరు, మార్టూరు,అద్దంకి, సంతమాగులూరు, మండాల్లో రైతు ఉత్పత్తి సంస్థ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పటిష్ట లింక్డ్ క్రెడిట్ ప్లాన్ 2023-24 ను ఆవిష్కరించారు.ఈ పటిష్ట లింక్డ్ క్రెడిట్ ప్లాన్ ఆధారoగా బ్యాంకులు క్రెడిట్ ప్లాన్స్ సిద్ధం చేయాలని కలెక్టర్ చెప్పారు.ఈ సమావేశంలో నాబార్డు ఎల్.డి.ఎం కె.ఆర్.డి. కార్తికే,జిల్లా సహకార అధికారి రామారావు, జిల్లా పరిశ్రమల శాఖ జి.ఎం.మదన్ మోహన్ శెట్టి,పశుసంవర్ధక శాఖ జె.డి హనుమంతరావు, ఉద్యాన వన శాఖ జె.డి జెనెమ్మ, తదితరులు పాల్గొన్నారు.