శ్రీకాకుళంజిల్లా లో 4వరోజు 72% హాజరు..
Ens Balu
3
Srikakulam
2020-09-23 14:00:45
శ్రీకాకుళం జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలు సజావుగా జరిగాయని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. బుధవారం, ఉదయం, గ్రామ వ్యవసాయ సహాయ కులు (గ్రేడ్-2) (విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ) పోస్టునకు పరీక్షలు జరిగాయి. జిల్లాలో 5 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం స్కూల్, గీతాంజలి స్కూల్, భాష్యం హై స్కూల్, చైతన్య హై స్కూల్, ఎం.వి.ఎస్. డిగ్రీ కాలేజీలలో ఈ పరీక్షలు జరిగాయని చెప్పారు. మొత్తం 702 మంది అభ్యర్ధులకు గాను 508 మంది అభ్యర్ధులు హాజరైనారని, 194 మంది అభ్యర్ధులు గైర్హాజరైనారని 72 శాతం అభ్యర్ధులు హాజరైనట్లు తెలిపారు. కరోనా పోజిటిన్ పేషెంట్లు ఎవ్వరూ హాజరు కాలేదని చెప్పారు. అదేవిధంగా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ వివరించారు. పరీక్షా కేంద్రం వద్ద మందులు, మంచినీరు, ఆరోగ్యసిబ్బంది, వికాలంగులకు ప్రత్యేక వీల్ చైర్స్ ఇలా అన్ని సదుపాయాలు కల్పించినట్టు చెప్పారు. ప్రతీఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించిన తరువాత అభ్యర్ధులను లోనికి అనుమతిస్తున్నట్టు కలెక్టర్ వివరించారు.