జివిఎంసి లో బుధవారం నిర్వహించిన టౌన్ ప్లానింగ్ స్పందన కార్యక్రమానికి 12 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ పి. రాజాబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి ప్రజలకు తిరిగి సమాధానం చెప్పాలని చీఫ్ సిటీ ప్లానర్ కు సూచించినట్టు తెలియజేశారు. జివిఎంసి పరిధిలో ఎలాంటి అనాధికార నిర్మాణాలు జరుగుతున్న, నిబంధనల ఉల్లంఘించి భవనాలు నిర్మించిన, భవన నిర్మాణ వ్యర్ధాలపై, టౌన్ ప్లానింగ్ విభాగం పై ఎలాంటి ఫిర్యాదులనైనా 8187897569 ప్రతి రోజూ నేరుగా తెలియజేయవచ్చునన్నారు.