18న ప్రొద్దుటూరులో శ్రీనివాసుని కల్యాణం


Ens Balu
18
Proddatur
2022-12-14 17:51:54

డా. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ హైస్కూలు మైదానంలో డిసెంబరు 18వ తేదీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన గోవిందమాల భక్త బృందం టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. టీటీడీ అధికారుల సూచనల మేరకు వేదిక, విద్యుత్, బ్యారికేడ్ల నిర్మాణం పనులకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశారు. 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వేలాదిమంది భక్త బృందం సమక్షంలో కన్నుల పండువగా కల్యాణం నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం  చేయనుంది.