పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ప్రతీఒక్కరూ దేశసేవ చేయాలి


Ens Balu
18
Anakapalle
2022-12-15 08:53:25

అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాల స్ఫూర్తితో రాష్ట్రానికి దేశానికి మన వంతు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి పిలుపునిచ్చారు.  స్వర్గీయ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జ్యోతి వెలిగించి, పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  తెలుగువారి ఆత్మగౌరవానికి, స్వాతంత్ర్యానికి, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు 56 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణ త్యాగం చేశారన్నారు.  తెలుగు రాష్ట్రం కోసం  త్యాగంచేశారని, వారి ప్రేరణతో మనం కూడా రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడేలా ఏ రంగంలోనైనా సేవ చేయాలన్నారు. ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారని, హరిజనోర్ధనకు  పాటుపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. వెంకటరమణ, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కే.రాజేశ్వరి ప్రసంగించారు. ఏబిసిడబ్ల్యూఓలు కే.సురేష్, నాగేశ్వరరావు, నరసింహమూర్తి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.