ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన, పొట్టి శ్రీరాములు త్యాగనిరతి అజరామరమని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కొనియాడారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో, గురువారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి కోసం ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు, తెలుగుజాతి ఉన్నంత వరకు అమరజీవిగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, డిఆర్‌డిఏ పిడి ఎ.కల్యాణచక్రవర్తి, సిపిఓ పి.బాలాజీ, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ బి.పద్మావతి, పంచాయితీరాజ్ ఎస్ఇ బిఎస్ఆర్ గుప్త, జిల్లా పర్యాటకాధికారి పిఎన్‌వి లక్ష్మీనారాయణ, జిల్లా బిసి సంక్షేమాధికారి యశోధనరావు, సిబ్బంది పాల్గొన్నారు.