7రోజులు ముందుగా హైరిస్క్ గర్భిణీలను గుర్తించాలి


Ens Balu
9
Parvathipuram
2022-12-15 09:43:37

ప్రసవానికి ఏడు రోజులు ముందుగా హై రిస్క్ ఉన్న గర్భిణీలను  గ్రామాల్లో గుర్తించి జిల్లా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాలు,  పాఠశాలల్లో ఉన్న 10 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త హీనత లోపం లేకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. హై రిస్క్ ఉన్న రోగులను గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించాలని అన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం క్రింద గ్రామాల్లో పారిశుధ్య మెరుగుకు ఇంటింటికీ చెత్త సేకరణ రోజువారీగా తప్పకుండా జరగాలన్నారు.

 చెత్త నుండి సంపద కేంద్రాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. క్లాప్ మిత్రా జీతభత్యాలు సకాలంలో చెల్లించాలని అన్నారు. జిల్లాలో జరుగుతున్న జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాల లక్ష్యాలను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్,  జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా గ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, డిప్యూటీ డి ఎమ్ అండ్ హెచ్ ఓ దుర్గా కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.