అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరువలేనివి


Ens Balu
9
Parvathipuram
2022-12-15 09:53:55

ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాలు మరువలేనివని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పొట్టి శ్రీరాములు 70వ వర్థంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేషకృషి చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.మహాత్మాగాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం పనిచేసిన మహనీయుడు శ్రీరాములు అని అన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న మహోన్నతుడు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో   జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ, డిప్యూటీ డి ఎమ్ అండ్ హెచ్ ఓ దుర్గా కల్యాణి,  తదితరులు పాల్గొన్నారు.