అమరజీవి స్పూర్తితో లక్ష్యాలను సాధించాలి


Ens Balu
11
Rajamahendravaram
2022-12-15 10:05:38

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం నుంచి ప్రతి ఒక్కరూ లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తి పొందాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం అమరజీవి పొట్టి శ్రీరాములు 70 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, డిఆర్వో జీ. నరసింహులు, జిల్లా అధికారులు పి. జగదాంబ, పి. లక్ష్మణ రావు, కె. ప్రకాశరావు, కే ఎన్ జ్యోతి, పి ఎస్ రమేష్,  వి. శాంత మణి, పి. వీణాదేవి, తదితరులు పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.