డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొని అంతిమంగా ప్రజలకు మేలు చేకూర్చాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా జిల్లాస్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి అధికారులతో ఉమ్మడి జిల్లా నుండి ఉద్యోగుల విభజన, పెండింగ్ అంశాలపై మరియు కన్వర్జేన్సీ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా విభజన జరిగి ఎనిమిది మాసాలు గడిచినప్పటికీ ఇంకా కాకినాడ నుండి సిబ్బంది విభజన, రికార్డులు అందుబాటు పెండింగ్ అంశాలపై స్పష్టతకు రావాల్సిన అవసరం ఉందని మీ శాఖలలో పెండింగ్లో ఉన్న అంశాలు నా దృష్టికి తెస్తే మీ యొక్క హెచ్ ఓ డీల తో సంప్రదించి పరిష్కారానికి చర్యలు గైకొనడం జరుగుతుం దన్నారు. ఇకపై పరిపాలన అనేది జిల్లా స్థాయిలోనే జరగాలని ఆ దిశగా ప్రతి ఒక్కరూ సమన్వయం వహించాలని ఆదేశించారు.
ప్రభుత్వం అనేక ప్రాధాన్యతా o శాలను త్వరితగతన పూర్తి చేయాలని నిత్యం సమీక్షలు నిర్వహిస్తోందని ఆ దిశగా అధికారి యంత్రాoగo పూర్తి సమన్వయం వహించి అంతిమంగా ప్రజలకు మేలు చేకూర్చాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నిర్దేశం ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలలో ఆశించిన పురోగతిని చూపాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి శాఖ కన్వర్జెన్సీ విధానంలోనే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుందని, ఆయన స్పష్టం చేశారు. ఉదాహరణకు పౌష్టికాహార లోపం అనేది వైద్యులు నిర్ధారించాక మహిళా శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహారం అందించి లక్ష్యాలను చేరుకోవడం జరుగు తుందన్నారు.ఆదేవిధంగా నవరత్నా లు పేదలందరికీ భాగంగా వివిధ శాఖలు కన్వర్జేన్సీ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ప్రభుత్వశాఖలలో సమన్వయo అనేది కీలకమైన పాత్ర పోషిస్తుం దన్నారు.
అధికారులు పూర్తి సమన్వయంతోనే ప్రజలకు అంతిమంగా ఆయా వసతులను సంక్షేమాలను చిట్టచివరి లబ్ధిదారుల వరకు అందించాల్సి ఉంటుందని ఆయన పునరు ద్ఘాటించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు చేపట్టే కార్యక్రమాలను ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ విశ దికరించారు అదేవిధంగా సిబ్బంది సమస్యలు ఇతర శాఖాపరమైన విభజన సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ద్యాన చంద్ర డిఆర్ఓ సత్తిబాబు జిల్లా స్టాయిఅధికారులు తదితరులు పాల్గొన్నారు.