ప్రభుత్వ భవనాలను సత్వరమే పూర్తిచేయాలి


Ens Balu
14
Amalapuram
2022-12-15 10:44:34

ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు త్వరగా పూర్తి చేసి ఆయా వసతులను అందుబాటులోకి తేవాలని, అదేవిధoగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు నిర్మాణాలు వేగవంతం చేసి లబ్ధిదారుల చిరకాల వాంఛ సొంత ఇంటి కలను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా సంబంధిత ఇంజనీర్ల  ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్పందన అర్జీలు రీఓపెన్ కాకుండా చర్యలు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణాల స్థితిగతులు, జగనన్న కాలనీలో విద్యుత్ కనెక్షన్లు, గృహ నిర్మాణాల్లో పురోగతి, జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్మాణం వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష రీ సర్వే  స్పందన అర్జీలు నాణ్యతతో పరిష్కారం, అంశాల పురోగతిపై జిల్లాలు వారిగా జిల్లా  కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ తో సమీక్షించారు.

వీడియో కాన్ఫరెన్స్ సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారుల ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా నీటి యజమాన్య సంస్థ జిల్లా పంచాయతీ అధికారులు పూర్తి సమన్వయంతో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చెత్త నుండి సంపత్తి తయారు చేసే నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తూ ఆరోగ్యకర సామాజిక స్థాపన దిశగా ముందడుగు వేయా లన్నారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగం వారు రెవెన్యూ శాఖ సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్షా రి సర్వే పూర్తి నాణ్యత ప్రమా ణాలతో పారదర్శంగా చేపట్టి నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసి భూ యజమానులకు హక్కుపత్రాల పంపిణీకి చర్యలు గైకొనాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో గర్భం దాల్చిన మహిళలలో రక్తహీనత లేకుండా పౌష్టికాహారం అందిస్తూ ప్రసవ తేదీకి వారం ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రుల లోని కాన్పు కొరకు వేచి ఉండు గదులలో ప్రవేశం కల్పించి సుఖప్రసవాలు నిర్వహించుకునే విధంగా ప్రసవ ప్రణాళికలను రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తూ మాతా శిశు సంరక్షణ దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ద్యానచంద్ర, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, డిపిఓ వి కృష్ణకుమారి జిల్లా నీటి యజమాన్య సంస్థ పిడి ఎస్ మధుసూదన్ ఆర్డ బ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఎస్. ఇ.లు కృష్ణారెడ్డి ,చంటిబాబు జిల్లా ఆర్థిక గణాంక అధికారి వెంకటే శ్వర్లు, గృహ నిర్మాణ సంస్థ పిడి సిహెచ్ బాబురావు డి సి హెచ్ ఎస్ పద్మశ్రీ రాణి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దుర్గారావు దొర, ఐసిడిఎస్ పిడి జీవి సత్యవాణి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పిడి వి శివశంకర్ ప్రసాద్,  మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మహమ్మద్ జిల్లాస్థాయి  అధికారులు దళితులు పాల్గొన్నారు.