ఆంధ్రప్రదేశ్ లో తలసరి చేపల వినియోగం 8 నుంచి 22 కేజీలవరకూ పెంచడమే ప్రధాన లక్ష్యంగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం పనిచేస్తూ ఫిష్ ఆంధ్రాషాపులకు మత్స్యకారుల ద్వారా పెద్ద ఎత్తున సబ్బిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యేల కంబాలజోగులు పేర్కొన్నారు. గురువారం రాజాం నియోజవకర్గంలోని రాజాం, సంతకవిటి, ఆర్. ఆముదాల వలస ప్రాంతాల్లోని 22 చేపల చెరువుల్లో 3.39లక్షల చేప పిల్లల(బొచ్చు, రాగండి, ఎర్రమైల)ను మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి ఆధ్వర్యంలో చెరువుల్లోకి విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం 2020-21కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులను ఆర్ధికంగా అభివృద్ధి చేసేందుకు ఈ చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలోని లీజు చెరువుల్లో వదిలిపెట్టిన చేప పిల్లలను పూర్తిస్థాయిలో మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఔట్ టెల్లు ఏర్పాటు చేసుకొని ఆర్ధికంగా వృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
మత్స్యశాఖ ఉప సంచాలకులు నిర్మలకుమారి మాట్లాడుతూ, పీఎంఎంఎస్ వై పథకం ద్వారా ఎస్సీ ఎస్టీలకు 60శాతం సబ్సిడీ, ఇతరులకు జనరల్ మత్స్యకారులకు 40శాతం సబ్సిడీతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
ఫిష్ ఆంధ్రా ఔట్ లెట్ల ద్వారా మత్స్యకారులు ఆర్ధికంగా పరిపుష్టి సాధించడానికి ఈ పథకం ఎంతో చక్కగా పనిచేస్తుందన్నారు. సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మత్స్యకారుల అభివృద్ధి చెందేవిధంగా ఈ పథకాన్ని మత్స్యకారులందరికీ చేరువ చేస్తున్నట్టు వివరించారు. మరింత మంది మత్స్యకారులు ముందుకి వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
రాజాం టౌన్ కన్వీనర్ శ్రీనివాసరావు, ఎంపీపీ రాజగోపాలరావు, జెడ్పీటీసీ బండి నర్శింగరావు, సర్పంచ్ లు, మత్స్యశాఖ సహాయ తనిఖీదారు
సిహెచ్వీవీ.ప్రసాదరావు, ఏఎఫ్ఓ వెంకటేష్, విఎఫ్ఏ లు సత్యన్నారాయణ, శారద, శ్రీనివాస కిరణ్, చైతన్య, రఘురామ్, ఉమామహేశ్వర్రావు, వెంకట్ మత్స్యకార
సంఘం సొసైటీ అధ్యక్షుడు తవుడు, సంఘ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.