ఎస్.హెచ్.ఆర్.సి. చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తిని జిల్లా అడిషనల్ ఎస్.పి. పి. శ్రీనివాస్ మర్యాదపూర్వంగా కలిశారు. శుక్రవారం కాకినాడ కు విచ్చేసిన ఆయనను ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద కలిసారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమొక్కను అందజేశారు. జిల్లాలో పోలీసుశాఖ ద్వారా అందజేస్తున్న సేవలను ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పి.తో పాటు కాకినాడ డి.ఎస్.పి. పి. మురళీ క్రిష్ణా రెడ్డి, కాకినాడ 1వ పట్టణ సి.ఐ. వి.కృష్ణ, ఇతర పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు.