రోడ్డు విస్తరణకు రూ.10 కోట్లు..మంత్రి అవంతి


Ens Balu
1
Visakhapatnam
2020-09-23 18:27:09

విశాఖపట్నం జిల్లాలో రెడ్డిపల్లి - పద్మనాభం రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు.  రెడ్డిపల్లి-పద్మనాభం రోడ్డు  సుమారు 3.50 కి.మీ. విస్తరణకుగాను  న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు (ఎన్.డి.బి.) సహకారంతో పనులు చేపట్టుటకుగాను ప్రభుత్వం జి.ఓ.ఆర్.టి. నం.303, తే 22.11.2019 ది, టి.ఆర్ అండ్ బి శాఖ ద్వారా రూ.10.04 కోట్లు (అక్షరాల పది కోట్లు నాలుగు లక్షల రూపాయలు మాత్రమే) మంజూరు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి రోడ్డు విస్తరణ పనులకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరగా  తక్షణమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వు లను జారీ చేసినట్లు మంత్రి వివరించారు.