2010 నుంచి 2016 సంవత్సరం మధ్య ఆధార్ కార్డు పొందిన వారందరూ ఆధార్ కార్డును నవీకరణ చేయించు కోవాలని ఐటిడిఎ పి.ఓ.ఆర్. గోపాల కృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆయన పాడేరులోని తన కార్యాలయంలో ఆధార్ కార్డ్ అప్డేషన్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఆధార్ గుర్తింపు ద్వారా వివిధ ప్రభుత్వ పధకాలకు మరియు బ్యాంకు సేవలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభముగా పొందుటకు అవకాశం వుంటుందని చెప్పారు. తమ పేరు, ఐడి మరియు చిరునామా కు సంబదించిన రుజువు పత్రములతో ఆధార్ అప్ డేట్ చేయించుకోవాలని చెప్పారు.పూర్తి
వివరాలకు మీ దగ్గరలోని ఆధార్ కేంద్రం నకు తమ పేరు మరియు చిరునామా కు సంబదించిన రుజువు పత్రములతో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
పి ఎం యు అధికారి మల్లికార్జున, ఆధార్ సబ్బంది నాగరాజు తదిరులు పాల్గొన్నారు.