ఓటర్లు జాబితా ఫిర్యాదులపై ప్రత్యేక టోల్ ఫ్రీనెంబర్


Ens Balu
10
Paderu
2022-12-27 11:30:20

ఓటర్ల జాబితా పై సందేహా  నివృత్తికి, ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టరేట్ ఎన్నికల విభాగంలో ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ 18004256826ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.  ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చట మార్చటం తొలగించుట ఫోటో మార్పు, పోలింగ్ కేంద్రాల మార్పు, పోలింగ్ కేంద్రాల బదలాయింపు మొదలగు అంశాలకు సంబంధించి ఫారం 6, 7, 8 లలో దరఖాస్తులు స్వీకరించిన విషయం విధితమే.  ఈ నేపథ్యంలో ఆ దరఖాస్తులపై తీసుకున్న చర్యలు, వాటి పరిష్కారం, వాటి పరిశీలన ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకోవటానికి, ఎపిక్ కార్డుల వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 18004256826 నంబర్ కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని కలెక్టర్ వివరించారు.