గిరి విజ్ఞాన సంబరాలను విజయవంతంగా నిర్వహించాలని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు. తలారి సింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలురు ఆశ్రమ పాఠశాలలో నిర్వహించనున్న గిరి విజ్ఞాన సంబరాల ఏర్పాట్లను మంగళవారం పిఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల28,29,30 తేదీలలో గిరి విజ్ఞాన సంబరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐటీడీఏ స్థాయిలో జరుగుతున్న గిరి విజ్ఞాన సంబరాల్లో 122 స్కూల్స్ నుండి విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ప్రతిరోజు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ. కొండలరావు, ఏ టి డబ్ల్యు ఓ ఎల్. రజని, హెచ్ఎం ఆర్. జాన్, పలువురు ఉపాధ్యాయులు తదితరుల పాల్గొన్నారు.