ఆదర్శప్రాయమైన విజయాలు వివిధ రంగాల్లో సాధించిన ముగ్గురు ప్రముఖులను ఇండియ న్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఐఎస్‌టీడీ) ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. బుధవారం ఈ కార్యక్రమం విశాఖ పౌరగ్రంథాలయంలో అట్టహాసంగా సాగింది. ఐఎస్‌టీడీ జాతీ య వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ప్రొఫెసర్ ఎన్.సాంబశివరావు, ఐఎస్‌టీడీ విశాఖపట్నం చాప్టర్ కు గొప్ప సహకారం అందించిన గీతం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శివ రామ కృష్ణ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.సి.దాస్ ఐఎస్‌టీడీ విశాఖపట్నం చాప్టర్ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి, సభ్యుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. మాపల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో, సీఐఐ గత ప్రెసిడెంట్ జి.శివ కుమార్ ‘చేంజ్ ఆర్డర్ ఆఫ్ ది వరల్డ్ పోస్ట్ పాండమిక్’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఐఎస్‌టీడీ చైర్మన్ డాక్టర్ ఒ.ఆర్.ఎం.రావు, గౌరవ కార్యదర్శి డాక్టర్ హేమ యడవల్లి, కోశాధికారి జి.సరస్వతి రావు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు, డాక్టర్ పి.ఎస్.ఠాగూర్, ఐఎస్‌టీడీ ఇతర సభ్యులు పాల్గొన్నారు.