నూతన సంవత్సరం సందర్భంగా తమకు శుభాకాంక్షలు చెప్పేటప్పుడు, ఒకరోజులోనే వాడిపోయి వడలిపోయే ఫ్లవర్ బొకేలను తీసుకురావద్దని జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి కోరారు. వాటికి బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు లాంటి సామగ్రిని మాత్రమే తీసుకురావాలని సూచించారు.పూలబొకే వ చ్చే ఆనందం కంటే పుస్తకాలు పిల్లలకు పంచడం ద్వారా మరింత రెట్టింపు వుంటుందన్నారు. కాగా జిల్లా కలెక్టర్ ఆదివారం ఉదయం 9 గంటలు నుంచి, కలెక్టర్ క్యాంపు ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉంటారని డిఆర్ఓ ఎం.గణపతిరావు తెలియజేశారు.