జనవరి 3వ తేదీన సావిత్రిబాయి ఫూలే విగ్రహావిష్కరణ జరుగుతుందని, రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ప్రకటించారు. కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిభా ఫూలే విగ్రహం ప్రక్కన, సావిత్రిభాయి ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణాన్ని సుమారు రూ.43.75లక్షలతో ఆధునీకరించి, గ్రానైట్‌తో, రంగుల విద్యుత్ దీపాలతో, వాటర్ ఫౌంటెన్‌తో అందంగా తీర్చిదిద్దారు. ఈ సుందరీకరణ పనులను కోలగట్ల శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎస్‌వివి రాజేష్ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి ఫూలే జన్మదినోత్సవం సందర్భంగా, జనవరి 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు, విగ్రహావిష్కరణ చేయనున్నట్లు తెలిపారు. ఆ రోజు వైఎస్ఆర్ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం విగ్రహావిష్కరణ జరుగుతుందని చెప్పారు. ఈ పరిశీలనా కార్యక్రమంలో మున్సిపల్ ఇన్‌ఛార్జి కమిషనర్ ప్రసాదరావు, ఎంఇ శ్రీనివాసరావు, తాశీల్దార్ సిహెచ్ బంగార్రాజు, పలువురు కార్పొరేటర్లు, జోనల్ ఇన్‌ఛార్జిలు, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.