అనకాపల్లి జిల్లాలో ప్రతీ ఒక్కరూ ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పటాన్ శెట్టి రవి శుభాష్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో ఆధార్ మోనిటరింగ్ కమిటీ సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు మీ ఆధార్ ని 10(2010 నుండి 2015 మధ్యలో చేసుకున్న వారు డాక్యుమెంట్ అప్ డేట్ చేసుకోవాలని లేదంటే ప్రభుత్వ పథకాలు వర్తించవని చెప్పారు. సంవత్సరాల క్రితం పొంది మరియు దానిని ఎప్పుడూ అప్డేట్ చేయలేకపోతే అప్ డేట్ చేసుకోవాలన్నారు. 5 సంవత్సరాలు దాటిన వారు కొత్తగా నమోదు
చేయాలని, తిరిగి 15 సంవత్సరాలు దాటిన వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్ డేట్ చేసుకోవాలని చెప్పారు. అప్డేట్ చేసిన ఆధార్-శక్తివంతమైన ఆధార్ జీవన సౌలభ్యాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు.
ఒక దేశం ఒక రేషన్ కార్డు కార్యక్రమం కింద లబ్ధిదారులు దేశంలో ఎక్కడి నుండైనా రేషన్ పొందవచ్చున్ని వివరించారు. ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ చేయడం వలన బ్యాంకు ఖాతా తెరవడం సులభతరమని చెప్పారు. దాదాపు 1000 ప్రభుత్వ పథకాలు/కార్యక్రమాల ప్రయోజనాలను నివాసితులు లబ్ధిపొందుతున్నట్లు వివరించారు. ఆధార్ ను ఉపయోగించి మొబైల్ సిమ్ పొందడం సులభతరమన్నారు. వివిధ స్కాలర్షిప్ పథకాలకు మెరుగైన సౌలభ్యమన్నారు. తప్పిపోయిన కుటుంబ సభ్యులను ఆధార్ సహాయంతో తిరిగి వారి కుటుంబాలతో కలపడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మీరు ఆదాయపు పన్ను చెల్లింపుదారు అయితే, మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్ ను సులభంగా ఇ-వెరిఫై చేయవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ వెంకటరమణ, జియస్డబ్ల్యూఎస్ ప్రత్యేక అధికారి మంజులవాణి, ఆధార్ ప్రాజెక్టు మేనేజర్ గిరిధర్, సిఎస్సి మేనేజర్ జగదీష్, తదితర అధికారులు పాల్గొన్నారు.