మహా విశాఖ నగరాభివృద్ధిలో జర్నలిస్టులు అందించిన సహకారం మరువలేనిదని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. ఇక్కడ సీతమ్మ ధార విజేఎఫ్ వినోద వేధికలో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం 2023 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ను పలువురు అతిథులతో కలిసి మేయర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో విశాఖ అగ్రగామి గా నిలిచింది అంటే అందుకు జర్నలిస్టుల సహకారమే ప్రధానమన్నారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షన్ లో మహావిశాఖకు నాలుగో రాంక్ రావడంలో కూడా మీడియా ప్రధాన పాత్ర పోషించింది అన్నారు. గౌరవ అతిథిలుగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి,
వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ అక్కర మాని విజయనిర్మల, పి సి పి ఐ ఆర్ చైర్మన్ చొక్కాకుల లక్ష్మీ, జి సి సి కార్పొరేషన్ చైర్మన్ శోభ స్వాతిరాణి ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండ రమాదేవ లు పాల్గొని మాట్లాడుతూ, సమాజము లో మీడియా వల్లే అన్ని విషయాలు ప్రజలకూ తెలియ చేయగలుగుతున్నామన్నారు.
సభ్యుల సంక్షేమానికి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం చేస్తున్న కృషి అత్యంత ప్రశంసనీయమన్నారు.. ప్రతీ పండుగను క్రమము తప్పకుండా నిర్వహించడం, జర్నలిస్టులకు క్రీడలతో పాటు అనేక సంక్షేమ ఫలాలు అందించడం అభినందనీయమన్నారు. నూతన సంవత్సరంలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు ఆనందమయ జీవనం గడపాలని వీరంతా ఆకాంక్షించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శీను బాబు మాట్లాడుతూ గడిచిన ఏడాదిలో తమ సభ్యుల కోసం ఎంతగానో శ్రమించి అనేక కార్యక్రమాలను విజయవంతం చేసామన్నారు. దసరా, దీపావళి పండుగలు నిర్వహించడము తో పాటు మీడియా అవార్డుల ప్రధానోత్సవం కూడా అత్యంత ఘనము గా నిర్వహించామన్నారు. అలాగే జర్నలిస్టుల పిల్లలకు ప్రతి ఏటా ఉపకార వేతనాలు అందజేస్తున్నామన్నారు. తమ కార్యవర్గం హయాంలో కేవలం సభ్యుల వైద్య సదుపాయాలు కోసం సుమారు 22లక్షలు వెచ్చించామన్నారు..
నూతన సంవత్సర వేడుకలతో పాటు జనవరి 3 నుంచి జర్నలిస్టుల క్రీడా సంబరాలు ప్రారంభం కానున్నాయన్నారు. ఫోరం కార్యదర్శి దాడి రవికుమార్ . ఉపాధ్యక్షులు ఆర్. నాగరాజ్ పట్నాయక్ లు మాట్లాడుతూ అందరి సహకారం తోనే ఆయా కార్య క్రమాలు విజయ వంతం చేయ గలుగు తున్నా మన్నారు. సభ్యులకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి వీరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తొలుత స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ బాలలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించా యీ. కార్య క్రమంలో ఫోరమ్ కార్య వర్గ సభ్యులు ఐరోతి ఈశ్వర్ రావు, ఎం ఎస్ ఆర్ ప్రసాద్, పి. వరలక్ష్మి, దొండ గిరిబాబు, డేవిడ్, శేఖర మంత్రి,తదితరులు పాల్గొన్నారు.