ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పై టెలి స్పందన..


Ens Balu
2
Parvathipuram
2020-09-23 19:27:46

విజయనగరం ఏజెన్సీలోని అక్టోబర్ 02 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూమి లేని గిరిజన రైతులను గుర్తించి పట్టాలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. అందులో భాగంగా 23వ తేదీ బుధవారం ఉదయం 10.30 గంటల నుండి 1.00 వరకు   ఐ.టి.డి.ఎ పరిధిలో వున్న సబ్ ప్లాన్ మండ లాల్లో ఆర్. ఓ.ఎఫ్.ఆర్ పట్టాల నిమిత్తం ఏటువంటి సందేహాలు ఉన్నా ఫోన్ చేసి తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి ఈ టెలి స్పందన ఏర్పాటు చేసినట్టు వివరించారు.  అలాగే  సెప్టెంబర్ 24వ తేదీ నుండి సబ్ ప్లాన్ మండల తహశీల్దార్ కార్యాలయాలో, ప్రతి గ్రామ సచివాలయాలో ప్రతి రోజూ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు వినతులు స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ టెలి స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమానికి ఎ.పి. ఓ సురేష్ కుమార్, ఆర్. ఓ.ఎఫ్.ఆర్ తహశీల్దార్ దేవదానం పాల్గొన్నారు.