నూతన సంవత్సరం 2023లో జర్నలిస్టులు వారి కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలని, వారికి అన్నింటా మంచి జరగాలని సింహాద్రి అప్పన్నను వేడుకున్నట్టు వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు, సింహాచలం ట్రస్టుబోర్డు ప్రత్యేక ఆహ్వానితులు గంట్లశ్రీనుబాబు తెలియజేశారు. ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా జర్నలిస్టులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, తన జీవితం జర్నలిస్టుల సంక్షేమానికే అంకితం చేస్తున్నానన్నారు. జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకి సాగుతున్నానన్నారు.