విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారికి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.నిర్మలకు మారి, ఇతర సిబ్బంది ఆంగ్లనూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. కలెక్టర్ సూచనల మేరకు పూల బొకేలు కాకుండా నిరుపేద విద్యార్ధుల కోసం పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు ఒక కిట్ గా తయారు చేసి వాటితో కలెక్టర్ కు శుభాకంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త ఏడాది ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు మరింతగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ డిడితోపాటు ఎఫ్డీఓ చాందిని, విఎఫ్ఏలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.