అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్-మంత్రి అవంతి


Ens Balu
2
Visakhapatnam
2020-07-02 11:06:51

విశాఖపట్నం లో పలు అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపన కార్యక్రమాలు బుధవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ప్రభుత్వం పథకాలు అమలుచేస్తుందన్నారు విద్యార్దులకు గుణాత్మకమైన, నాణ్యమైన విద్యను అందించేందుకు పలు పథకాలు ప్రేవేశపెడుతున్నారని పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి అమ్మవడితో పాటు, వసతి దీవెన, విద్యా దీవెన ,పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన అభివృద్ధికి నాడు.. నేడు, పథకాలను అమలుచేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎన్నో పథకాలను అమలు చేస్తునట్లు వివరించారు. రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పారు. సింహచలంలోని 98 వార్డ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అక్కడ స్థానిక పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి, అక్కడ నుండి గాజువాక నియోజక వర్గంలో పలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్దులకు కోసం హైస్కూల్ ప్రాంగణంలో 15 లక్షల రూపాయల ఎంపీ కోటా నిధులతో భోజనశాల భవన నిర్మాణనికి శంకుస్థాపన చేశారు. 5వ జోన్ పరిధిలోని 59 వ వార్డులో దాదాపు 40 లక్షల రూపాయలతో రోడ్డు, ఆర్.సి.సి. కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక పేద ప్రజలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం 58 వార్డ్ లో సి.సి.డ్రైన్ లు, తదితర పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ లోక్ సభలో రాష్ట్ర ప్రయోజనాలు కోసం పోరాడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సత్యనారాయణ, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.