స్పందన గ్రీవెన్స్ కు వస్తున్న అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనకాపల్లి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా 110 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, అసిస్టెంట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వెంకట రమణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.