విశాఖపట్నం లో మార్చి 28, 29 తేదీలలో విశాఖ వేదికగా జరుగనున్న ప్రతిష్టాత్మక జి-20 సదస్సుకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. బుధవారం విశాఖలో జి -20 సదస్సు ఏర్పాట్లు , నిర్వహణపై జీవీఎంసీ, రెవెన్యూ, టూరిజం, విఎంఆర్డీఏ సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖపట్నం వేదికగా జరిగే జి –20 సదస్సుకు 20 దేశాల నుండి అతిధులు రానున్నారని, వారికి అన్ని ఏర్పాట్లు ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.