ఎలమంచిలికి చెందిన కొండమంచి వాణి అనే బాలికకు, ఎస్. రాయవరం మండలం సైతారు పేట గ్రామానికి చెందిన కలగా శివాజీ లకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ లక్ష చొప్పున చెక్కులను జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి మంజూరు చేశారు. ఆ చెక్కులను అనకాపల్లి ఆర్డీవో ఏ.జి.చిన్ని కృష్ణ స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు. కొండమంచి వాణికి పుట్టిన దగ్గరనుంచి మాటలు రాలేదు, చెవులు వినపడలేదు. ఎస్.రాయవరం మండలం సైతాలు పేట గ్రామానికి చెందిన కలగా శివాజీ మూడు సంవత్సరాల క్రిందట మోటార్ బైక్ ప్రమాదంలో తీవ్ర గాయాల బారిన పడి చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన అవయవాలు ఏమి పని చేయడం లేదు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వెంటనే జిల్లా కలెక్టర్ చెక్కులను పంపించగా అనకాపల్లి రెవిన్యూ డివిజనల్ అధికారి చిన్ని కృష్ణ వారికి చెక్కులను అందజేశారు.