బహిరంగ సభలు, సమావేశాలకు ఖచ్చితంగా పోలీసులు అనుమతి పొందిన తరువాత ఏర్పాటు చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్.రాధిక ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఏపి 30 పోలీస్ చట్టం అమలులో ఉందని, గుంపులుగా ఒకే చోట ఏర్పడటం, ర్యాలీలు మొదలైన వాటిని నిషేధిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. నిబంధనలను మేరకు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా జిల్లావ్యాప్తంగా అన్ని స్టేషన్లు, సర్కిళ్లు, సబ్ డివిజనల్ పోలీసు అధికారులు కూడా ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. అనుమతి లేనిదే సభలు జరగకూడదని ఆ ప్రకనటలో పేర్కొన్నారు.